గంటకు 3రౌండ్లు ఓట్ల లెక్కింపు

15 May, 2019 12:25 IST|Sakshi

సర్వీసు ఓటు లెక్కింపునకు నాలుగు నిమిషాలు

పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాతే ఈవీఎం కౌంటింగ్‌

ఫలితాలు వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం

జిల్లా ఎన్నికల అధికారి హరి కిరణ్‌

కడప సెవెన్‌రోడ్స్‌ :జిల్లాలో ఈనెల 23న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి సి.హరి కిరణ్‌ కోరారు. మంగళవారం తన చాంబర్‌లో అభ్యర్థులు, పార్టీల ప్రతిని«ధులతో ఆయన సమావేశమయ్యారు.  23వ తేది ఉదయం 8.00 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పూర్తయ్యే వరకు బ్రేక్‌ ఉండదని చెప్పారు. గంటకు మూడు రౌండ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుందన్నారు. గతంలో మాదిరి ఫలితాలు త్వరగా వచ్చే అవకాశం ఉండదని చెప్పారు. కడప పార్లమెంటు సెగ్మెంట్‌లో 1940 మంది సర్వీసు ఓటర్లకు ఈటీపీబీఎస్‌ పద్దతిలో పోస్టల్‌ బ్యాలెట్లు పంపించామని పేర్కొన్నారు. అందులో ఇప్పటివరకు 870 వచ్చాయన్నారు.  సమయం ఉన్నందున80 శాతం వరకు పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చే అవకా శం ఉందన్నారు. ఒక్కో ఈటీపీబీఎస్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌కు నాలుగు నిమిషాలు పడుతుందని చెప్పారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎం కౌంటింగ్‌ చేపడతామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈవీఎంలలో కౌంటింగ్‌ పూర్తి చేయకూడదని స్పష్టం చేశా రు.

కడప లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెం ట్లలో రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌తో సహా బద్వేలు 11, కడపలో 15, పులివెందుల 11, జమ్మలమడుగు 15, మైదుకూరు 11, కమలాపురం 15, ప్రొద్దుటూరు 15 చొప్పున మొత్తం 93 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోస్టల్‌ బ్యా లెట్ల కౌంటింగ్‌కు సంబంధించి ఒక్కొక్కో రూములో తొమ్మిది టేబుళ్లు చొప్పున రెండు రూముల్లో 18 టేబుల్స్‌ ఉంటాయన్నారు. ఈటీపీబీఎస్‌ లెక్కింపునకు ఒక హాలులో ఎనిమిది టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. దీని ప్రకారం 112 మంది కౌంటింగ్‌ ఏజెంట్ల పేర్లను, ఫోటోలను ఈనెల 16లోగా సమర్పించాలని సూచిం చారు. క్రిమినల్‌ కేసులుఉన్న వారిని ఏజెంట్లుగా నియమించరాదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీ కలిగిన వారిని కూడా ఏజెంట్లుగా ప్రతిపాదించరాదన్నారు. ఏజెంట్లకు ఈనెల 20న ఐడీ కార్డులు జారీ చేస్తామన్నారు. డిక్లరేషన్‌ ఫారం సమర్పించి ఐడీ కార్డులు తీసుకోవాలని చెప్పారు.  మొదట పోస్టల్‌ బ్యాలెట్లు, ఈటీపీబీఎస్, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్‌ జరుగుతుందన్నా రు. ఇవన్నీ పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో ఎం పిక చేసిన వీవీ ప్యాట్‌ స్లిప్పులను కౌంటింగ్‌ చేస్తామన్నారు. డీఆర్వో రఘునాథ్, కడప పార్లమెంటు అభ్యర్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు