ముగ్గురు దొంగలు అరెస్ట్: భారీ నగదు స్వాధీనం

11 Jan, 2014 14:54 IST|Sakshi

వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కడప నగర పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. చోరీల వద్ద నుంచి రూ. 7 లక్షలకు పైగా విలువైన బంగారు ఆభరణాలతోపాటు రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలపై పోలీసులు కేసు నమోదు చేసి, తమదైన శైలీలో దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.

 

అలాగే వరంగల్ జిల్లా ములుగు మండల కేంద్రంలో వాహనదారుల కళ్లు కప్పి బైక్లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 24 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

 

అయితే హైదరాబాద్ నగరంలోని హస్తినాపురంలోని ఓ ఇంటిలో దొంగలు బీభత్సం సృష్టించారు. 25 తులాల బంగారంతోపాటు కిలో వెండి, రూ. లక్ష నగదు అపహరించారు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు