వైఎస్‌ జగన్‌ విజయం వెనుక.. ఆ ముగ్గురు!

9 Mar, 2020 05:08 IST|Sakshi

ఆకట్టుకుంటున్న ‘హ్యాపీ ఉమెన్స్‌ డే’ వీడియో

సాక్షి, అమరావతి: ‘ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుందంటారు.. మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెనుక ఉన్న ఆ ముగ్గురు స్త్రీ మూర్తులు వీరే’.. అన్న వీడియో మహిళా దినోత్సవం సందర్భంగా వైరల్‌ అవుతోంది. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి టీవీ రూపొందించిన ఈ వీడియోను వైఎస్సార్‌సీపీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. సోషల్‌ మీడియా విభాగం ఈ వీడియోను విస్తృతంగా వివిధ గ్రూప్‌లలో పోస్టు చేసింది.

రాష్ట్ర ప్రజలను ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజకీయంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారని, ఆ సమయంలో ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ, భార్య వైఎస్‌ భారతి, సోదరి షర్మిల ఆయనకు అండగా నిలిచారని అందులో పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ జైల్లో ఉన్నప్పుడు ‘నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న వదిలిన బాణాన్ని’ అంటూ వైఎస్‌ షర్మిల చేసిన ప్రచారాన్ని గుర్తుచేశారు. ఓ మంచి ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించిన వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, షర్మిలకు కృతజ్ఞతలు అంటూ వీడియోను ముగించారు.  

మరిన్ని వార్తలు