పోలీసులపై రాళ్లు రువ్వారు

4 Apr, 2017 12:23 IST|Sakshi
లంకమల ఫారెస్టులో కూంబింగ్‌
కడప: జిల్లాలోని లంకమల అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం స్పెషల్‌ టాస్కుఫోర్సు పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా తమిళకూలీలు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. పారిపోతున్న తమిళ కూలీలలో ఇద్దరు పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులకు తీవ్ర గాయలయ్యాయి. 
మరిన్ని వార్తలు