తిరుమల మ్యూజియం అభివృద్ధి చేయాలి

24 Jul, 2015 22:38 IST|Sakshi

తిరుమల: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర మ్యూజియంను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనసభ ఫిర్యాదుల కమిటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

తిరుమలలోని మ్యూజియంను అక్షరధామ్ మ్యూజియం తరహాలో తీర్చిదిద్ది, శ్రీవారి వైభవ ప్రాశస్త్యాన్ని, క్షేత్ర మహిమను భక్తకోటికి చేరుకునే కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీకి సూచన చేస్తామన్నారు. టీటీడీ ప్రచురణలు, సాహిత్య సంపదను ఇంటెర్నెట్ ద్వారా జన బాహుళ్యానికి చేరవేసేలా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ధార్మిక సంస్థ అయిన టీటీడీ ధర్మప్రచారానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వార్తలు