శ్రీకాకుళంలో తుపాను బాధితుల ధర్నా

18 Oct, 2018 11:22 IST|Sakshi

శ్రీకాకుళం: నరసన్నపేట, పాతపట్నం ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట తుపాను బాధితులతో కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్‌, రెడ్డి శాంతి, తదితరులు ధర్నా నిర్వహించారు. పంట, ఆస్తినష్టం అంచనా వేసి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో దయనీయ పరిస్థితులు ఉన్నాయని, 9 రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన సాయం అందలేదని తుపాను బాధితులు అన్నారు.

కనీస సౌకర్యాలైన తాగునీరు, ఆహారం కూడా ప్రభుత్వం కల్పించలేదని ఆందోళన చేశారు. తుపాను నష్టం అంచనా వేయడానికి అధికార బృందాలు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టం జరిగి 9 రోజులైనా విద్యుత్‌ పునరుద్ధరించలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. పాతపట్నం మండలం కొరసవాడ, బురగాం వద్ద బాధితులు రాస్తారోకోకు దిగారు. దీంతో ఒడిశా, ఆంధ్రా మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది.

మరిన్ని వార్తలు