ఆకలితీర్చే వారి కోసం ఎదురుచూపు!

15 Oct, 2018 08:51 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : టిట్లీ తుఫాను విలయం సృష్టించి 5రోజులు అవుతున్నా! ప్రభుత్వం మాత్రం సరిగా పట్టించుకోవటం లేదు. మంచినీరు, ఆహారం కోసం తుఫాను బాధితులు ఆహాకారాలు చేస్తున్నారు. సహాయక బృందాలు సైతం బాధిత ప్రాంతాలకు చేరుకోకపోవటం గమనార్హం. పాతపట్నం, ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లోని గ్రామాల ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సమీక్షించినా పనులు అరకొరగానే జరుగుతున్నాయి. ఆదివారం ప్రభుత్వ అధికారుల పనితీరును నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు సంబంధిత అధికారలు విద్యుత్‌ పునరుద్దరణ పనులు వేగవంతం చేశారు. దాదాపు 300గ్రామాలకు అధికారుల బృందాలు ఇంకా చేరుకోలేదు. ఇళ్లుకూలిపోయి నిరాశ్రయులు అయిన వారికి పునరావాసం కల్పించటంలో అధికారులు విఫలమయ్యారు. నాలుగు రోజులు గడిచినా! వందల కొద్ది నిరుపేద కుటుంబాలకు ఇప్పటివరకు అన్నం మెతుకు కూడా దొరకలేదు.
 

మరిన్ని వార్తలు