మొండి చెయ్యి

17 Mar, 2015 04:24 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎమ్మెల్సీ పదవులపై జిల్లాలో ఆశలు పెట్టుకున్న నాయకులకు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్యే కోటా లో తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఉన్నప్పటికీ జిల్లాలో సీనియర్ నాయకులకు మాత్రం చోటు దక్కలేదు. జిల్లా నుంచి మాజీ మంత్రు లు గాలి ముద్దుక్రిష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి ఎమ్మె ల్సీ పదవుల కోసం చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించారు. శాసనసభ ఎన్నికల్లో వీరిద్దరూ ఓటమిపాలు కావడంతో కనీసం ఎమ్మెల్సీ సీటునైనా దక్కించుకోవాలనే దృఢ సంకల్పంతో చివరి వరకు  పావులు కదిపారు.

ఈ నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ సైతం రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్సీ పదవి వేటలో గల్లా అరుణకుమారి, గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మధ్య అధిపత్యపోరు సాగింది. ఇద్దరు ఎమ్మెల్సీ స్థానాలపై కన్నేసి భారీగా లాబీయింగ్ సైతం చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం వారు గ్రూప్‌లుగా విడిపోయి ఎవరికి వారు బాబు వద్ద మెప్పు కోసం ప్రయత్నించారు. తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందనే ధీమాతో ఇప్పటి వరకు ఆశల పల్లకిలో ఊరేగారు.

ఇలాంటి తరుణంలో సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా వీవీ చౌదరి, సంధ్యారాణి, తిప్పేస్వామిలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించడంతో జిల్లా నాయకుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రు లు గాలి, గల్లా వర్గీయులు సైతం చంద్రబాబునాయుడుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై పార్టీ శ్రేణులు లోలోపల అసంతృప్తితో రగిలిపోతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామంటూనే ఇలా తమ నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికే వర్గాలతో సతమతమౌతున్న దేశం పార్టీలో మరిన్ని గ్రూపులు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమం త్రి సొంత జిల్లానే పార్టీ గ్రూపులుగా విడిపోతే దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా  ఉంటుందని అధిష్టానం సైతం ఆందోళన చెం దుతోంది. ముఖ్యంగా ఎమ్మె ల్సీ పదవుల విషయంలో  ముఖ్యమంత్రి ఒకరికి అవకాశం కల్పిస్తే ఇంకొక వర్గం నుంచి ఆగ్రహం చవిచూడక తప్పదనే భావనతో ఇద్దరినీ పక్కన పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు