రేషన్‌కు నిబంద్‌నలు!

16 Feb, 2016 00:34 IST|Sakshi
రేషన్‌కు నిబంద్‌నలు!

ప్రభుత్వం విధించిన నిబంధనలు చాలామందికి రేషన్ సరుకులు అందకుండా చేశాయి. ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ కార్డుదారులకు సరుకులు అందజేయాలనే నిబంధన ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, సర్వర్ ఇబ్బందులు పెట్టడం వంటి కారణాలతో సుమారు 16 శాతం మంది తిండి గింజలకు నోచుకోలేదు. సోమవారంతో గడువు ముగియడంతో కార్డుదారులు, డీలర్లు ఆందోళన చెందుతున్నారు.
 
రేషన్ సరుకులపంపిణీకి ముగిసిన గడువు
16 శాతం మందికి అందని తిండిగింజలు
ఆందోళన చెందుతున్న కార్డుదారులు, డీలర్లు
 

  
 వీరఘట్టం: జిల్లాలో 2,001 రేషన్ షాపులు ఉండగా 8,25,094 కార్డుదారులకు 13,530.730 మెట్రిక్‌టన్నుల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇంతవరకు 6,93,078 మంది కార్డుదారులకు(84 శాతం మందికి) బియ్యం పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో మరో 16 మంది సరుకులు నోచుకోలేదు. అలాంటి వారంతా గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారు.

డీలర్ల ఇబ్బందులు  
మరోపక్క మరుసటి నెల సరుకుల కోసం ప్రతి  నెల 16వ తేదీనే డీడీలు తీయాలనే నిబంధనను ప్రభుత్వం విధించడంతో డీలర్లలో కలవరం మొదలైంది. దీనికితోడు  ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు   రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచిరాత్రి 8 గంటల వరకు తప్పనిసరిగా రేషన్ షాపులు తెరవాలని నిబంధన సైతంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది.

 రెండు రోజులు గడువు కోరాం
సుమారు 16 మందికి సరుకులు అందని విషయాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సోమవారంతో రేషన్ బియ్యం పంపిణీకి గడువు ముగిసిందన్నారు. మరో రెండు రోజులు గడువు పెంచాలని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.

మరిన్ని వార్తలు