నేడు అక్షయ తృతీయ

7 May, 2019 08:29 IST|Sakshi
కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న బంగారు నగల దుకాణం

అనంతపురం కల్చరల్‌: అక్షయ తృతీయ వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని పండుగల్లోకి అక్షయ తృతీయకు ఓ ప్రత్యేకత ఉంది. అక్షయం అంటే క్షయం కానటువంటిది. కాబట్టి అక్షయ తృతీయ రోజు చేపట్టిన కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా విజయవంతమవుతాయన్నది అందరి విశ్వాసం. హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని ఇదే రోజు రాయడం ప్రారంభించారని, దశావతారాలలో ఒకరైన పరుశురాముడు అక్షయ తృతీయ పర్వదినాన జన్మించాడని, అదేవిధంగా క్షీరసాగర మథ«నంలో మహాలక్ష్మీ అమ్మవారు ఇదే రోజు ఉద్భవించినట్లు చాలా మంది విశ్వసిస్తున్నారు.    లక్ష్మీ మాత ఆవిర్భావ దినాన ధన, ధాన్య, వస్తు, వాహనాలను ముఖ్యంగా బంగారాన్ని కొని దాచుకుంటే మరింత వృద్ది జరుగుతుందన్న సెంటిమెంటు ఉండడంతో నగరంలోని బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 

మరిన్ని వార్తలు