నేడు అమిత్‌షా రాక

21 Feb, 2019 08:26 IST|Sakshi

రాజమహేంద్రవరంలో కార్యకర్తలతో మాటా, మంతీ

అనంతరం బహిరంగ సభలో ప్రసంగం

చురుకుగా బీజేపీ నేతల సన్నాహాలు

తూర్పుగోదావరి, సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జరగనున్న బహిరంగ సభలో పాల్గొనడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. లాలా చెరువు సమీపంలో సభకు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై లబ్ధిదారులతో చర్చిస్తారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. శక్తి కేంద్రాల సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో అమిత్‌ షా మాట్లాడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు పాల్గొంటారని అన్నారు.

స్కూల్‌ పిల్లాడికి ఉన్న దేశభక్తి కూడా బాబుకు లేదు
అమరులైన జవాన్ల త్యాగ నిరతిని కొనియాడుతూ స్కూల్‌ పిల్లలు సహితం నివాళులు ఘటిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులో ఆ పాటి దేశభక్తి కూడా లేకుండా పోయిందని వీర్రాజు ఎద్దేవా చేశారు. 40 మంది మృతి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ హస్తం ఉందంటూ మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. స్థానిక ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న పిల్లలు వీధిల్లోకి వచ్చి కొవ్వొత్తులతో అమర వీరులకు నివాళులు ఘటిస్తుంటే ఇదంతా రాజకీయ స్టంట్‌ అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ కాళ్లు పట్టుకొని నెగ్గి, నాలుగున్నర సంవత్సరాలుగా మోదీ గొప్పవాడని పొగిడి... ఇప్పుడు మోదీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకి లేదన్నారు.

మరిన్ని వార్తలు