నేడు జిల్లా బంద్

14 Feb, 2014 03:42 IST|Sakshi
నేడు జిల్లా బంద్

నేడు జిల్లా బంద్ : భాను
 జగ్గయ్యపేట అర్బన్, : లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 14వ తేదీ శుక్రవారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
 
 ఈ బంద్‌కు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు సహకరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి వేరొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా