ఆన్‌లైన్‌కే మా ‘ఓటు’

25 Jan, 2016 19:48 IST|Sakshi
ఆన్‌లైన్‌కే మా ‘ఓటు’

  నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

 ఈ-రిజిస్ట్రేషన్‌తో ఓటు ఈజీ
  ఇక నిరంతరం ఆన్‌లైన్ ఓటరు నమోదు
  ఇంటి వద్ద నుంచే ఓటరు నమోదుకు అవకాశం  


 
 విజయనగరం కంటోన్మెంట్: ఫారాలు నింపడం, అధికారుల చుట్టూ తిరగ డం, కార్డు వచ్చేంతవరకు టెన్షన్ పడ డం వంటి వాటికి ఇక చెక్ పడనుంది. ఓటరు నమోదు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వా రా మరింత సులభతరం చేస్తూ ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఇం టి వద్ద నుంచే ఓటరుగా నమోదు కావడానికి వీలు కల్పించింది. దీనికి కేవలం స్థానికతను ధ్రువీకరిస్తూ ఓ ఫొటోను జత చేయడమే పని. ఈఆర్‌ఎంఎస్ అం టే ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావడంతో జిల్లాలో ఇటీవలే సుమారు లక్ష మంది నకిలీ ఓటర్లను తొలగిం చారు.
 
 ఏటా జనవరి 25న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీ య ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. తద్వారా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసు, బ్యాంకుల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లుగా చేరేవారు ఫారం6ను సవివరంగా నింపినా కొన్ని తిరస్కరణకు గురైన సందర్భాలుంటాయి. ఓటరు కార్డు కావాలని మరోసారి దరఖాస్తు చేసేందుకు సమయాన్ని వెచ్చించినా వచ్చేంత వరకు అనుమానమే.
 
 దీన్ని అధిగమించేందుకు ఉన్న ఏకైక అస్త్రం ఈ-రిజిస్ట్రేషన్. నెట్ ద్వారా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికలసంఘం కల్పిం చింది. ఆన్‌లైన్‌ద్వారా పదిహేను నిమిషాల్లోనే దరఖాస్తు ఎన్నికల సంఘానికి పంపించవచ్చు. నమోదు చేసుకున్న తర్వాత ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఐడీ నంబర్ ద్వారా దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సందేహాలుంటే 1950కి ఫోన్‌చేయవచ్చు. ఎన్నికలసంఘం వెబ్‌పేజీ కోసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్‌ను వాడుకోవచ్చు.
 
 నమోదు ఇలా....
  వెబ్‌పేజీ ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సిఈఓఆంధ్రా.ఎన్‌ఐసి.ఇన్ వెబ్ అడ్రస్ టైప్ చేయగానే ఎన్నికల సంఘం హోంపేజీ ఓపెన్ అవుతుంది.
 
  ఆ తర్వాత పైన వరుసలో కనిపించే బార్‌లో ఈ-రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై మౌస్‌తో క్లిక్ చేయగానే నాలుగు రకాల ఫారాలు కనిపిస్తాయి. అందులో ఫారం-6 (న్యూ ఎన్‌రోల్‌మెంట్) కొత్త ఓటరు నమోదును ఎంచుకోవాలి.

  అనంతరం మరో విండోలో రిజిస్ట్రేషన్ చేసుకునేందకు ఫారం-6 ఓపెన్‌అవుతుంది.

 అంతకుముందే పాస్‌పోర్ట్ ఫోటోను స్కాన్‌చేసి కంప్యూటర్‌లో భద్రపరుచుకోవాలి.  ఫోటో వెడల్పు, పొడవులు 240, 320గా పెట్టుకుని 100 కేబీ మించకుండా చూసుకోవాలి. ఫోటో బ్రౌజ్ అన్న చోట క్లిక్ చేసి అప్‌లోడ్ చేయాలి
 
  పేరు, చిరునామా, ఇతరత్రా వివరాలు ఫారంలో ఇంగ్లిష్‌లో నమోదు చేయాలి. అన్ని పూర్తయ్యాక ఫారం చివరిలో ఉన్న ట్రాన్స్‌లేట్ బట న్‌ను క్లిక్ చేయగానే ఫారంలో మనం ఇంగ్లీషులో నమోదు చేసి న వివరాల కింత తెలుగు పదాలు వస్తాయి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేయాలి.

  సబ్‌మిట్ చేసిన తరువాత మీకో ఫోటోతో సహా వివరాలతో కూడిన ఐడీ నంబర్ వస్తుంది. దా న్ని ప్రింట్ తీసుకోవచ్చు. ఐడీ నంబర్‌తో ఎప్పటికప్పుడు కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు.
 
 ఇంకొన్ని...
  ఓటరు ఐడెంటిటీ కార్డు పొందాలంటే మీ సేవలో రూ.10 చెల్లిస్తే సరిపోతుంది.
  ధృడమైన మెటల్‌తో తయారు చేసిన కలర్ కార్డు కావాలంటే రూ.25 చెల్లించి మీ సేవలో పొందవచ్చు.
 
 తగ్గిన ఓటర్లు :
 జిల్లాలో ఓటర్ల సంఖ్య గతంలో కంటే గణనీయంగా తగ్గింది. గతంలో జిల్లాలోని ఓటర్ల సంఖ్య 17,31,610 మంది ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 16,61,593 కు తగ్గింది. వీరిలో మహిళలు 8,41,605మంది ఉండగా పురుషులు  8,19,988 మంది    ఉన్నారు. థర్డ్ జెం డర్ ఓటర్లుగా 138 ఉన్నారు. ఓటర్లలో రెండేసి, మూడేసి ఉండ డంతో ఇప్పుడు ఆ ఓటర్లను ఎన్నికల సంఘం గుర్తించి ఓటరు జాబితాల్లోంచి తగ్గించింది. ఇందుకోసం సరి కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించింది.  
 
 రెండేళ్ల నుంచి హిజ్రాలకు ప్రాధాన్యం...
 జిల్లాలో హిజ్రాలకు ఓటర్లుగా గుర్తింపునివ్వడం రెండేళ్ల నుంచి ప్రారంభమైంది. అప్పటి కలెక్టర్ కాంతి లాల్ దండే దీనిపై దృష్టి సారించి జిల్లాలో వంద మందికి పైగా హిజ్రాలకు ఓటరు నమోదు చేయించారు. అంతే కాకుం డా వారికి జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఓటరు గుర్తింపు కార్డులిచ్చారు. అంతే కాకుండా వారు కూడా ఓటరు నమోదు ప్రాధాన్యతను తెలియజేస్తూ ర్యాలీలు నిర్వహించి చైతన్య పరిచే కార్యక్రమాన్ని చేపట్టడం గొప్పవిషయం. ప్రస్తుతం జిల్లాలో 138 మంది హిజ్రా ఓటర్లున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.  
 
 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం అవకాశం
 జిల్లాలో ఉన్న యువత ఓటరుగా నమోదు చే యించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల సంఘం కూడా ఇందుకు మంచి అ వకాశాన్ని కల్పించింది. ఆన్‌లైన్‌తో ఓటరు న మోదుకు ఇక ఎల్లప్పుడూ అవకాశం ఉం టుంది కనుక అర్హత కలిగిన యువత వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదే సమయం లో చనిపోయిన, వలస పోయిన, రెండేసి ఓట్లున్న  వారి ఓట్లు తొలగించేందుకు ముందుకు రావాలి.    - వై.రాధాకృష్ణ వాణి,
 సూపరింటెండెంట్, ఎన్నికల సెల్
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా