ఈనాటి ముఖ్యాంశాలు

19 Jun, 2019 19:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జమిలి ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు అఖిలపక్ష సమావేశం జరిగింది. జమిలి ఎన్నికలపై ఓ కమిటీ వేయాలని నిర్ణయించారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది ప్రభుత్వ ఎజెండా కాదని, దేశ ఎజెండా అని పేర్కొన్నారు. 40 పార్టీలను ఆహ్వానిస్తే, 24 పార్టీలు పాల్గొన్నాయన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టీస్ రామసుబ్రహ్మణ్యంను హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గెజిట్ విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టీస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌ను నియమించారు. ఇప్పటి వరకు తాత్కాలిక న్యాయమూర్తిగా కొనసాగిన రాఘవేంద్ర సింగ్ చౌహన్ ఇక నుండి చీఫ్ జస్టీస్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు