ఈనాటి ముఖ్యాంశాలు

27 Feb, 2020 19:33 IST|Sakshi

 అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన పర్యటనను నిరసిస్తూ ఉత్తరాంధ్ర వాసులు ఆందోళనకు దిగారు. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవడం మంచి పరిణామమని, అందులో తప్పేమీ లేదని తెలంగాణ పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న, సమర్ధిస్తున్న వర్గాల మధ్య దేశ రాజధానిలో జరిగిన హింసాకాండలో మృతిచెందిన వారి సంఖ్య గురువారం నాటికి మరింత పెరిగింది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఏడుగురు నేడు మరణించటంతో మృతుల సంఖ్య 27 నుంచి 35కు చేరింది. గురువారం చోటు చేసుకున్న మరిన్ని విశేషాల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు