నేటి వార్తావిశేషాల విహంగవీక్షణం

8 Aug, 2017 17:44 IST|Sakshi

ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే సీఎం చంద్రబాబు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడేళ్ల పాలనలో చంద్రబాబు నంద్యాల ముఖం కూడా చూడలేదన్నారు. నంద్యాల అభివృద్ధిని కోరుకునేది శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని పేర్కొన్నారు. రోడ్లు వెడల్పు చేయమని గతంలో శిల్పా మోహన్‌ రెడ్డి కోరితే నిధులు ఎక్కడున్నాయని చంద్రబాబు అవహేళన చేశారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను మీడియా ముందు ప్రదర్శించారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

బెడిసిన వ్యూహం
నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడం అసాధ్యమనే అభిప్రాయానికి వచ్చిన అధికార టీడీపీ నేతలు తాజాగా మైండ్‌ గేమ్‌కు తెర లేపారు.

'టీడీపీపై ప్రజా వ్యతిరేకత వాస్తవమే'
టీడీపీపై ప్రజా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు.

వాళ్లు టూరిస్టులు.. నేను లోకల్‌: కేటీఆర్‌
నేరెళ్ల బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నేరెళ్ళ బాధితులను మంగళవారం ఉదయం ఆయన పరామర్శించి దాదాపు గంట సేపు బాధితులతో మాట్లాడారు.

పొన్నం ప్రభాకర్‌ దీక్ష భగ్నం
జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత మూడు రోజులుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న ఆమరణ దీక్షను పోలీసులు మంగళవారం ఉదయం భగ్నం చేశారు.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఆ రెండూ ఒకేచోట వద్దు : షియా బోర్డు
అయోధ్య కేసులో మంగళవారం సుప్రీం​కోర్టులో కీలక వాదోపవాదాలు జరిగాయి.

‘క్విట్‌ ఇండియా’ నినాదం ఎవరిది?
‘క్విట్‌ ఇండియా’ నినాదం భారతీయుల హదయాల్లో ఎంతగా నాటుకుపోయింది.

'ఆరు నెలల్లో నేర్చుకోండి.. లేదంటే పీకేస్తాం'
ఆరు నెలల్లో కన్నడం నేర్చుకోకుంటే ఉద్యోగంలో నుంచి తీసి పారేస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులను హెచ్చరించింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఆంటీగ్యాంగ్‌ పట్టివేత..
రుణ గ్రహీతల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్న ఆంటీగ్యాంగ్‌ ఆట కట్టింది.

హెచ్‌-1బీ వీసాలతో ఏ దేశానికి లాభం?
హెచ్‌-1బీ వీసా ప్రొగ్రామ్‌.. గత కొంతకాలంగా ఇటు భారత్‌కు, అటు అమెరికాకు వివాస్పదమైంది.

పాక్‌: ఉగ్రవాది హఫీజ్‌ సంచలన నిర్ణయం
ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ మరో సంచలనానికి తెరలేపాడు.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>>

యాక్సిస్‌ బ్యాంకు కూడా తగ్గించేసింది
ప్రముఖ ప్రయివేటు యాక్సిస్‌ బ్యాంకు కూడా వడ్డీరేటులో  కోత పెట్టింది.  అంచనాలకనుగుణంగానే యాక్సిస్‌ కూడా వడ్డీరేటును  తగ్గిస్తున్నట్టు మంగళవారం  ప్రకటించింది.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌: ఆఫర్లివే!
అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

జియో ఎఫెక్ట్‌ : వొడాఫోన్‌ ''సూపర్‌ అవర్‌'' ప్లాన్స్‌
టెలికాం ఇండస్ట్రిలో రిలయన్స్‌ జియో ఎఫెక్ట్‌ అంతా ఇంతా కాదు. జియో తెరతీస్తున్న ధరల యుద్దానికి టెలికాం కంపెనీలు కూడా వరుసబెట్టి ఆఫర్ల మీద ఆఫర్ల కురిపిస్తున్నాయి.

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>

విరాట్.. పాక్ మాజీని చూసి నేర్చుకో!
మన మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యత సంజయ్ మంజ్రేకర్కు విరాట్ సేన సాధిస్తున్న విజయాలు అంతగా రుచిస్తున్నట్లు లేదు. టీమిండియా  ఏమాత్రం కష్టపడకుండానే విజయాల్ని సాధిస్తుందనే అపోహలో ఉన్నట్లు ఉన్నాడు.

'ఆసీస్ రికార్డును బద్దలు కొడతాం'
శ్రీలంకతో ఇక్కడ జరిగిన రెండో టెస్టులో 29వ సారి ఆరొందల పరుగుల మార్కును భారత్ తన ఖాతాలో వేసుకుంది.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>

సూపర్ స్టార్ సినిమా రీమేక్లో సూపర్ హీరో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రీమేక్‌లో హీరో మహేష్‌ కాకపోవచ్చు.

పెళ్లి కళ!
నిఖిల్‌ హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. ఇప్పు డింకా హ్యాండ్‌సమ్‌గా తయారయ్యారు. అదంతా పెళ్లి కళ అన్నమాట.

మరిన్ని వార్తలు