నేటి ముఖ్యాంశాలు

7 May, 2018 18:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికకు ఆస్పత్రికి వచ్చి 6 గంటలు గడిచినా చికిత్స అందించక పోవడం గమనార్హం. గైనకాలజిస్టులు అందుబాటులో లేరంటూ వైద్య సిబ్బంది బాధిత చిన్నారికి పరీక్షలు చేయడం లేదు. దీంతో తమ పాపకు ఏమౌతుందోనని బాలిక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటలకు బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యుల నిర్లక్ష్యంతో సాయంత్రం ఐదు గంటలు దాటినా చికిత్స ప్రారంభించలేదు.

మోదుకూరు బాధితురాలికి ఇంకా అందని వైద్యం

సాక్షి, గుంటూరు: తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మోదుకూరులో లైంగిక దాడికి గురైన ఏడేళ్ల బాలికకు ఆస్పత్రికి వచ్చి 6 గంటలు గడిచినా చికిత్స అందించక పోవడం గమనార్హం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రామకృష్ణ ఫైర్‌
సాక్షి, విజయవాడ : కొద్ది రోజుల్లోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద రూపాయలకు వెళ్లడం ఖాయమని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. నియంతృత్వ పాలకుడు మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2019లో బీజీపీని ఓడించడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు.

ఏపీకి ప్రథమ శత్రువు చంద్రబాబే
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీని రాష్ట్రానికి రెండో శత్రువుగా, కాంగ్రెస్‌ని మూడో శత్రువుగా భావిస్తున్నామన్నారు. 

సీఎం చంద్రబాబుకు అవినాష్‌ రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్‌ కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వైఎస్సార్‌ కడప జిల్లా ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తుంగభద్ర డ్యాంలో ఉన్న నికర జలాలను చిత్రావతి జలాశయానికి తరలించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈ లేఖ రాశారు.

మహిళల కోసం ప్రత్యేక మెట్రో స్టేషన్‌
సాక్షి, హైదరాబాద్‌: మహిళల కోసం ప్రత్యేకంగా మెట్రో స్టేషన్ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

ఈనెల 21 తర్వాత టీఎస్‌ఆర్టీసీ సమ్మె!
సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్‌భవన్‌’ చేపట్టారు. దీంతో బస్‌భవన్‌ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సీఎం కేసీఆర్‌తో కలిసి అనుదీప్‌ లంచ్‌!
సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు అనుదీప్, ఆయన తల్లిదండ్రులు సోమవారం ప్రగతి భవన్‌కు వచ్చారు.

రోడ్డుపై షటిల్‌ ఆడిన విక్టరీ వెంకటేశ్‌
మొన్న క్రికెట్‌ దేవుడు సచిన్‌ రోడ్డు పైకి వచ్చి క్రికెట్‌ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ ఆడటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

రోజూ 3వేల కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ
మనీలా: దేశంలో నెలకొన్న డిమాండ్‌ నేపథ్యంలో రూ. 3 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లను ప్రతి రోజూ ముద్రిస్తున్నామని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నగదు లభ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని, అదనపు డిమాండ్‌ను అందుకుంటున్నామని ఆయన చెప్పారు.

ప్రధాని మోదీకి లీగల్‌ నోటీసులు
సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గట్టి షాక్‌ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు పరువు నష్టం దావా వేశారు. రూ. 100 కోట్లకు ఆయన దావా వేసినట్లు తెలుస్తోంది

అతి తక్కువ ధరలో పానసోనిక్‌ స్మార్ట్‌ఫోన్‌
సాక్షి, ముంబై: ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్‌ మార్కెట్లో  ఆవిష్కరించింది.  'పీ95'  పేరుతో  ఎంట్రీ లెవల్‌  4 జీ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం విడుదల చేసింది. బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులకు రూ.4,999 ధరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది.

రోహిత్‌ కంటే రాహుల్‌ బెస్ట్‌.!
ఇండోర్‌ : టీమిండియా ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ బదులు కేఎల్‌ రాహుల్‌ తీసుకోవాలని అభిమానులు  సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌-11 సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు