ఈనాటి ముఖ్యాంశాలు

22 Jul, 2019 20:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. సమాచార హక్కు (ఆర్‌టీఐ) సవరణ బిల్లు తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. ఉద్యోగాల కల్పన, పెన్షన్ల వంటి అంశాల్లో సీఎం కేసీఆర్‌.. పక్కరాష్ట్ర ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఎంతో నేర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల పుణ్యమా అని పాత లబ్ధిదారులందరికి పెన్షన్లు పెరిగాయన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నిరుద్యోగ యువతను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గ్రామ సచివాలయాల కోసం భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఏకంగా 4.01 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టి రికార్డు సృష్టించారన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తూ.. నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాకు చెందిన గూఢచార సంస్థ సీఐఏ తరఫున పనిచేస్తోన్న 17 మంది సభ్యులను ఇరాన్ అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం అక్కడి మీడియా వెల్లడించింది. వారిలో కొందరికి ఉరిశిక్ష కూడా విధించినట్లు  తెలిపింది.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు