ఒక్క క్లిక్‌తో నేటి ముఖ్యాంశాలు

24 Jun, 2018 19:27 IST|Sakshi

సర్వే ఫలితాలు చూసి షాకయ్యా: సీఎం కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: మంచి పనులు చేసే ప్రభుత్వాలను, పార్టీలను ప్రజలు వదులుకోరని, టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధిని జనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ 100 పైచిలుకు స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సిటీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌, మాజీ మంత్రి దానం నాగేందర్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఏ క్షణమైనా ఎన్నికలు : విజయసాయి రెడ్డి
సాక్షి, విజయనగరం : ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు రావొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి వీ విజయసాయి రెడ్డి సూచించారు.

రెండు లక్షల రుణమాఫీ చేస్తాం
సాక్షి, నల్గొండ : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న బతుకమ్మ పండుగ ఇప్పుడు కవితమ్మ పండగగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌కు ‘భారతరత్న’ ప్రకటించాలి
హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): ఎన్నో విప్లవాత్మకమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి ‘భారత రత్న’ బిరుదు ప్రదానం చేయాలని ఆయన సన్నిహితుడు, వైఎస్సార్‌ సీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ వేదికగా మరో ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీ మరో ఉద్యమానికి వేదిక కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఎన్నో పర్యవరణ ఉద్యమాలను నిర్వహించిన చిప్కో ఇప్పుడు ఢిల్లీలో ఉద్యమానికి సిద్ధమైంది.

ఈ అభ్యర్థి ఆస్తులు రూ.22,300 కోట్లు!
ఇస్లామాబాద్‌: త్వరలో జరగనున్న పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు చెదిరే ఆస్తులున్న అభ్యర్థి బరిలోకి దిగాడు.

నాడబ్బు నాకు ఇచ్చేయండి
కర్ణాటక : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తీవ్ర పోరు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నేత గాలి జనార్థన్‌ రెడ్డి స్పందించారు.

విజయవాడలో దారుణం
సాక్షి, విజయవాడ : నగరంలోని కేఎల్‌ ప్రాథమిక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వ్యాక్సిన్‌ వికటించడంతో నలుగురు చిన్నారులు పరిస్థితి విషమంగా మారింది.

స్కూలుపై పగ; 90 సెకన్లలో విద్యార్థి హత్య..!
వడోదర: గుజరాత్‌లో దారుణం చోటుచేసుకుంది. యాజమాన్యంపై పగ పెంచుకున్న 10వ తరగతి విద్యార్థి ఎలాగైనా స్కూలును మూసేయించాలని పథకం పన్నాడు.

బిగ్‌బాస్‌కు షాక్‌
సాక్షి, చెన్నై: తమిళ బిగ్ బాస్ షోకు సినీ కార్మిక సంఘం‌ ఫెఫ్సీ (ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్ సౌత్‌ ఇండియా) షాకిచ్చింది.

రషీద్‌ ఖాన్‌పై మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

మరిన్ని వార్తలు