ఈనాటి ముఖ్యాంశాలు

6 Oct, 2019 19:42 IST|Sakshi

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హౌసింగ్‌ బోర్డు సెంటర్‌లో నెలకొల్పిన ఎస్వీ రంగారావు తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్నిమెగాస్టార్‌ చిరంజీవి ఆదివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టమని  చిరంజీవి తెలిపారు. రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులోభాగంగా ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు రవాణా, పోలీసు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయని ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్యక్షుడు అశ్వత్ధామరెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ట్రేడ్‌ యూనియన్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీని సమ్మెలోకి నెట్టిందని ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు