ఈనాటి ముఖ్యాంశాలు

2 Aug, 2019 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అన్నా క్యాంటీన్లను తాత్కాలికంగా మాత్రమే మూసివేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  క్యాంటీన్లను నిలిపివేయడం తమకు కూడా బాధగానే ఉందని, కానీ గత ప్రభుత్వం అనవసరమయిన చోట క్యాంటీన్లను నిర్మించిందని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఎమ్మెల్యే రైతుబజార్‌ను ప్రారంభించారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై సీఆర్‌పీసీ 153ఏ, 153బీ, 506, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి రాజస్తాన్‌ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. ఇండోనేసియాలో శుక్రవారం  భూకంపం సంభవించింది.  సుమత్రా దీవుల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ముందుస్తుగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు