ఈనాటి ముఖ్యాంశాలు

31 Jul, 2019 20:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఎన్ శుక్లాపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అనుమతించారు. ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తిపై సీబీఐ విచారణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తమకు ప్రాణహాని ఉందంటూ ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి కుటుంబం రాసిన లేఖను సుప్రీంకోర్టు బుధవారం పరిగణనలోకి తీసుకుంది. దీనిపై గురువారం విచారణ జరుపడానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. అలాగే లేఖ గురించి ఈరోజు పత్రికల్లో చదివేవరకు తనకు తెలియదని గొగొయి తెలిపారు. లేఖను ఆలస్యంగా ధర్మాసనం ముందుకు తీసుకురావడంపై అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలిశారు. ఈ నెల 6న హైదరాబాద్‌లో అమిత్‌ షా సమక్షంలో నాదెండ్ల భాస్కరరావు బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు పార్టీలో ఆయనకు ఎటువంటి పదవి కట్టబెట్టలేదు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు