ఈనాటి ముఖ్యాంశాలు

26 Sep, 2019 19:07 IST|Sakshi

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో దేశానికి  మార్గదర్శకంగా నిలవాలని, వివిధ దేశాల్లో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నపద్ధతులను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన ‘రివర్స్ టెండరింగ్‌’లో రూ. 200 కోట్లు ఆదా అయిందంటే ఆహ్వానించదగ్గ పరిణామమేనని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికతో రాష్ట్ర చరిత్ర మలుపు తిరగబోతుందని, ఇది అధర్మానికి, ధర్మానికి, అవినీతి,అరాచకానికి, న్యాయానికి మధ్య పోరాటమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.చంద్రయాన్‌- 2 ఆర్బిటార్‌ సమర్థవంతంగా పనిచేస్తోందని.. ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించిందని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం చైర్మన్‌ కె.శివన్‌ అన్నారు. దివంగత మావోయిస్టు అగ్రనేత ఆజాద్‌ భార్య, మహిళా మావోయిస్టు నాయకురాలు సుజాత అలియాస్‌ నాగరం రూపాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

>
మరిన్ని వార్తలు