ఈనాటి ముఖ్యాంశాలు

24 Jul, 2019 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తీరును ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ బుధవారం లోక్‌సభలో ఎండగట్టారు. సవరణ బిల్లుపై సభలో జరిగిన చర్చ సందర్భంగా ఓవైసీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్‌ కోఆర్డినేటర్‌ టీమ్‌ సభ్యులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ నిధులు కేటాయించి.. వారి సంక్షేమానికి పాటుపడుతున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మహిళల జీవితాలను మద్యం చిన్నాభిన్నం చేసిందని, గత ప్రభుత్వం రూపొందించిన మద్యం పాలసీతో వారికి కనీస రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని దశల వారిగా నిర్మూలిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం గొప్ప పరిణామం అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించడం గొప్ప నిర్ణయమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

>
మరిన్ని వార్తలు