ఈనాటి ముఖ్యాంశాలు

5 Aug, 2019 20:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును సత్వరమే ఆమోదించేదిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాజ్యసభలో ఈ బిల్లు సునాయసంగా గట్టెక్కెంది. అదేవిధంగా ఆర్టికల్‌ 370ను రద్దు చేసే తీర్మానాన్ని కూడా రాజ్యసభ ఆమోదించింది. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పెద్దల సభలో డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టగా.. అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో రాజ్యసభలో ఈ కీలక బిల్లును ఆమోదించుకుంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ, బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ, అన్నాడీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేడీ, టీడీపీలు మద్దతు తెలపగా, కాంగ్రెస్‌, పీడీపీ, డీఎంకే, ఎండీఎంకే వ్యతిరేకించాయి.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు