ఈనాటి ముఖ్యాంశాలు

6 Aug, 2019 19:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. మంగళవారం రాత్రి లోక్‌సభలో హోంమంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టిన జమ్మూ కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు అనుకూలంగా 370 మంది, వ్యతిరేకంగా 70 మంది ఓటు వేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏలను రద్దు చేసిన తీర్మానం కూడా లోక్‌సభ ఆమోదం పొందింది. బిల్లును ఆమోదించిన తర్వాత లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ విభజన గురించి సభలో కాంగ్రెస్‌ నేతలు అసత్యాలు చెప్పారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధ్వజమెత్తారు. ఏపీ విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంట్‌ ముందుకు తెచ్చారని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును సభలో ఎలా ప్రవేశపెట్టారని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. పార్లమెంటు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు 45 నిముషాల పాటు కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని సీఎం జగన్‌ ప్రధానిని కోరారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువగా లాభం చేకూరనుంది అని కేసీఆర్‌ అన్నారు. 25 ఏళ్లైనా పూర్తి కానటువంటి ప్రాజెక్ట్‌లను కేవలం మూడేళ్లలో పూర్తి చేశామని తెలిపారు. 

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు