ఈనాటి ముఖ్యాంశాలు

18 Jul, 2019 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మున్సిపల్‌ ఎన్నికలు అంత త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నిచింది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిల్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలకు ఇంకా 109 రోజులు గడువు ఉన్నా.. ఇప్పుడే ఎందుకంత హడావుడి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను.... వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌ రెడ్డి మరోసారి లోక్‌సభలో నొక్కి చెప్పారు. ఆయన గురువారం లోక్‌సభలో హోదా అంశంపై  కేంద్రాన్ని నిలదీశారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు.  ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్  ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో  చెన్నై అసుపత్రిలో  చికిత్స పొందుతున్న రాజగోపాల్‌ గురువారం మరణించారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు