ఈనాటి ముఖ్యాంశాలు

27 Jul, 2019 18:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌స‌భ‌లో అనుచిత వ్యా్‌ఖ్యలు చేసిన స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్‌ను క్షమించే ప్రసక్తే లేద‌ని డిప్యూటీ స్పీక‌ర్‌, బీజేపీ ఎంపీ ర‌మాదేవి అన్నారు. ఆమె శనివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆజంఖాన్‌ రెండు సార్లు కుర్చీలో ఉన్న త‌న‌ను అవ‌మానించార‌న్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం బోధనలు ఇప్పటికి కూడా ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. మాంసం వ్యాపారి మెయిన్‌ ఖురేషీ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌కు చెందిన సతీష్‌బాబు సానను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్‌ చేశారు. మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం ప్రకారం ఇతడిని అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ టైం గవర్నెన్స్‌ నూతన (ఆర్టీజీఎస్‌) సీఈవోగా ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రతి చిన్న విషయాన్నీ రాజకీయం చేసి రాద్దాంతం చేయటం తెలుగుదేశం పార్టీ వారికి అలవాటుగా మారిందని హోమ్‌ మంత్రి మేకతోటి సుచరిత  విమర్శించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలోని గోడ వివాదాన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం వారికే చెల్లిందన్నారు.


మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు