రామాలయంలో నేటినుంచి పవిత్రోత్సవాలు

16 Aug, 2013 04:41 IST|Sakshi

 భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భం గా శుక్రవారం నుంచి ఈనెల 21 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎం రఘునాద్, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలి పారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంట లకు పవిత్ర గోదావరి నుంచి నదీ జలాలను తీసుకొచ్చి పవిత్రోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు యాగశాలలో విశ్వక్సేణపూజ, పుణ్యాహవచ నం, మృతంగహణం, రక్షాబంధన తదితర పూజలు చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీతారామచంద్రలు ఉత్సవ మూర్తులకు. నిత్యసుదర్శన పెరుమాళ్లకు, ఆండాళ్ తల్లికి, అర్చకులకు దీక్షా ధారణ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
 
 17న ఉదయం బేడా మండపంలో పారాయణ దారులకు దీక్షా కంకణధారణ, సాయంత్రం 108 కలశాలతో అష్టోత్తర శతకలశావాహన, రాత్రికి తిరువీధి సేవ జరపనున్నారు. 18వ తేదీన స్వామి మూలవరులకు మహా కుంభప్రోక్షణ, పవిత్రారోహణం, రాత్రికి చుట్టూసేవ, 19న బింబం, కుంభం, మండలం, అగ్ని, చతుస్థానార్చన, 20న హోమాలు, 21న శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, హో మం, మహాపూర్ణాహుతి, తిరువీదిసేవ, పవిత్రోత్సవాల ఉద్వాసన ఉంటాయని వివరించారు. 21వ తేదీన హయగ్రీవ జయంతి సందర్భంగా ఉపాలయంలో వేంచేసి ఉన్నహయగ్రీవ స్వామికి ప్రత్యేక అభిషేకం చేస్తామన్నారు. చిన్నారులకు ఉచితంగా పలకలు, నోటుపుస్తకాలు అందజేయనున్నట్లు తెలిపారు.
 
 నేడు వరలక్ష్మీ వ్రతం...
 శ్రావణ శుక్రవారం సందర్భంగా రామాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో శుక్రవారం  ఉదయం 7 గంటలకు పంచామృతాభి షేకం చేయనున్నారు. వరలక్ష్మీ వ్రతం నిర్వహించటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శ్రావణ శుక్రవా రం సందర్భంగా ‘మనగుడి’ కార్యక్రమాలలో భాగంగా ఆర్‌టీసి ఇన్‌గేట్ వద్ద నున్న శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక వరలక్ష్మీ వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి టి.రత్నప్రభ తెలిపారు.
 
 

>
మరిన్ని వార్తలు