అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన వికేంద్రీకరణకు మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మరోవైపు, దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్ట్మార్టం నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇక, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ఈతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశం అయ్యారు. ప్రత్యేక ప్రతినిధుల చర్చల్లో భాగంగా శనివారం వీరిరువురూ దశాబ్దాల నాటి చైనా-ఇండియా సరిహద్దు వివాదంపై చర్చలు జరిపారు. శనివారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.