ఈనాటి ముఖ్యాంశాలు

17 Dec, 2019 20:17 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శాసనసభలో రాజధానిపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి యుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు హింసాత్మకంగా మారుస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇదిలా ఉండగా, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల‌ను కాంగ్రెస్ రెచ్చగొడుతోంద‌ని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇకపోతే, పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్‌లోని లాహోర్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది.  ఇక, వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రిలో మహాసుదర్శన యాగం నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మంగళవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

మరిన్ని వార్తలు