ఈనాటి ముఖ్యాంశాలు

20 Dec, 2019 20:06 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో  జీఎన్ రావు కమిటీ శుక్రవారం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ నిపుణుల కమిటీ సభ్యులు రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఇదిలా ఉండగా,  పోలీసులపై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే, పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో జరుగుతున్న ఆందోళనలకు విపక్షాలు బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మరోవైపు, ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా.. ఆ సంక్షోభం నుంచి బ‌లంగా గ‌ట్టెక్కుతామ‌ని ప్రధాని మోదీ అన్నారు. ఇక, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇదిలా ఉండగా, త్వరలోనే భవన నిర్మాణ అనుమతుల కోసం అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన విధానాన్ని చేపడుతున్నట్లు  తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆంక్షల్లేకుండా పింఛన్లు

ఎవరినీ వదలొద్దు..

కొబ్బరిని కాటేసిన కరోనా

రేషన్‌ కోసం తొందర వద్దు

హ్యాట్సాఫ్‌ డాక్టర్‌ నరేంద్ర

సినిమా

సూర్య సినిమాలో పూజకు ఆఫర్‌!

కాజోల్‌, నైసా బాగున్నారు: అజయ్‌ దేవ్‌గణ్‌

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం