ఈనాటి ముఖ్యాంశాలు

9 Jan, 2020 20:12 IST|Sakshi

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బృహత్తర ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ గడువు తీరనున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ శరవేగంగా పావులు కదుపుతోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల బి- ఫారాలను మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ అంద‌జేశారు. ఇక, కృష్ణా నీటి కేటాయింపుల అంశంపై జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ భేటీ అయింది. వరద సమయంలో వినియోగించుకున్న నీటి విషయంపై బోర్డు చర్చించింది. మే 31వ తేదీ వరకు రెండు రాష్ర్టాలకు నీటి కేటాయింపులు చేస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని జేఎన్‌యూ యునివర్సిటీలో ప్రొఫెసర్లు, విద్యార్థులపై జరిగిన దాడికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. గురువారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు