ఈనాటి ముఖ్యాంశాలు

30 Nov, 2019 19:35 IST|Sakshi

షాద్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియాంకారెడ్డి మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు, నగర ప్రజలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. చిన్నారులు, మహిళలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు కఠినతరం చేయనున్నట్లు హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల అమలుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్‌ డీజీపీపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని  పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌ అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బలపరీక్షలో విజయం సాధించారు. భారత్‌తో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని భావించిన పాకిస్తాన్‌, ఉగ్రవాదుల ద్వారా పరోక్ష యుద్ధం చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు