ఈనాటి ముఖ్యాంశాలు

27 Nov, 2019 20:01 IST|Sakshi

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తన నిర్ణయం మార్చుకుని పార్టీ నేతలతో మాట్లాడానని డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ స్పష్టం చేశారు. గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భ‌ద్రత‌ను కావాల‌నే ఎత్తివేసిన‌ట్లు వ‌స్తున్న వార్తల‌ను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌ పలు కీలక నిర్ణయాలను మంత్రి మండలితో చర్చించారు. రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ భూకుంభకోణం చేసిందని ఆయన విమర్శించారు. సినీ నటుడు సంపూర్ణేష్‌ బాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులకు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

మరిన్ని వార్తలు