ఈనాటి ముఖ్యాంశాలు

24 Oct, 2019 19:58 IST|Sakshi

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల్లో కారు జోరు చూపించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతిపై 43,624 ఓట్ల మెజార్టితో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి  ఘన విజయం సాధించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అఖండ మెజారిటీతో విజయాన్ని అందించిన ప్రజలకు ఆ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలతోపాటూ 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఇందులో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకోగా హర్యానాలో మాత్రం కాస్త తడబడింది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమఫలితాలు వచ్చాయి. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌) భవనాన్ని కేంద్రమంత్రి సదానందగౌడ్‌తో కలిసి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో హైకోర్టు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. 

>
మరిన్ని వార్తలు