ఈనాటి ముఖ్యాంశాలు

9 Oct, 2019 19:57 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  నరేంద్ర మోదీ సర్కార్‌ దీపావళి కానుక అందించింది. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ర‌సాయ‌న శాస్త్రంలో నోబెల్ అవార్డు విజేత‌ల పేర్లను బుధవారం ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈనెల 11న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను దాచిపెట్టిన కేసులో హైకోర్టు ఆదేశాలతో టీడీపీ దివంగత నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం బుధవారం మంగళగిరి కోర్టు ఎదుట లొంగిపోయారు. దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈ సారి కూడా రక్తసిక్తంగా మారింది. ప్రభుత్వ తీరు మారకుంటే తమ సమ్మెను మరింత ఉదృతం చేస్తామని టీఎంయూ ఆర్టీసీ యూనియన్‌ అధ్యక్షుడు అశ్వద్దామరెడ్డిన్నారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

>
మరిన్ని వార్తలు