నేడు సీఎం చంద్రబాబు రాక

12 Dec, 2014 01:42 IST|Sakshi
నేడు సీఎం చంద్రబాబు రాక

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడకు రానున్నారు. మధ్యాహ్నం 1.30కి  ఆయన హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి వచ్చి, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వెళతారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

రాత్రి 7 గంటలకు విజయవాడకు చేరుకుని  పోలీస్ కంట్రోల్‌రూమ్ సమీపంలో నిర్మించిన కొత్త ఫైర్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. రాత్రికి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. 13వ తేదీ ఉదయం పది గంటల తరువాత గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళతారు.    
 

మరిన్ని వార్తలు