‘ఫుల్’గా దరఖాస్తులు

28 Jun, 2014 04:49 IST|Sakshi
‘ఫుల్’గా దరఖాస్తులు

విజయనగరం రూరల్ : మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తారుు. మేము సైతం అంటూ మహిళలు కూడా దరఖాస్తు చేయడం ఆసక్తి రేకెత్తించింది. చంటి బిడ్డలతో వచ్చి మరీ మహిళలతో  భర్తలు దరఖాస్తు చేరుుంచారంటే మద్యం దుకాణాల్లో లాభం ఏ స్థారులో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆఖరి రోజు శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా దరఖాస్తులు అందారు. 2014-2015 సంవత్సరానికి సంబంధించి  మద్యం దుకాణాలు కేటాయించేందుకు  దరఖాస్తుల  స్వీకరణకు ఆఖరి రోజైన శుక్రవారం దరఖాస్తులు వెల్లువెత్తాయి.  జిల్లాలో 202 మద్యం దుకాణాలను  కేటాయించేందుకు  ఈ నెల 23న ఎక్సైజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేసింది.

ఈ నెల 23 నుంచి  27 వరకు  దరఖాస్తులు స్వీకరించేందుకు   గడువు విధించింది. అయితే శుక్రవారం దరఖాస్తులు స్వీకరించేందుకు ఆఖరిరోజు కావడంతో దరఖాస్తుదారులు  పోటెత్తారు. పట్టణంలోని నాయుడు ఫంక్షన్ హాల్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు  ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేయగా... శుక్రవారం  అమావాస్య కావడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తుదారులు ఆసక్తి చూపలేదు. తరువాత ఒక్కసారిగా వందలాది మంది  దరఖాస్తుదారులు రావడంతో అక్కడి ప్రాంతమంతా కిటకిట లాడింది.

శుక్రవారం ఒక్కరోజే  400లకు పైబడి దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు  తెలిపారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే దరఖాస్తుదారులను లోపలికి అనుమతించారు. గురువారం విజయనగ రం యూనిట్ పరిధిలో 35 దుకాణాలకుగాను 76 దరఖాస్తులు రాగా, పార్వతీ పురం యూనిట్‌లో 33 మద్యం దుకాణాలకు 78 దరఖాస్తులు వచ్చాయి. మూడు రోజుల్లో 95 దుకాణాలకు 187 దరఖాస్తులు రాగా, ఆఖరి రోజు 400లకు పైబడి దరఖాస్తులు వచ్చాయని విజయనగరం ఎక్సైజ్ సూపరిం టెండెంట్ పి.శ్రీధర్ తెలిపారు. దరఖాస్తులు ఎక్కువగా రావడం తో అర్థరాత్రి వరకు అధికారులు దరఖాస్తులను  లెక్కించారు.
 
మహిళలు సైతం...
మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు గత ఏడాదిలాగే  ఈ ఏడాది కూడా మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు.సుమారు 20 నుంచి 30 మంది వరకు మహిళలు దరఖాస్తులు అందజేశారు.
 
నేడు లాటరీ...
మద్యం దుకాణాలకు సంబంధించి శనివారం  నాయుడు ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ కాంతిలాల్ దండే లాటరీని తీస్తారని ఈఎస్ పి.శ్రీధర్ తెలి పారు. కలెక్టర్ ఆడిటోరియంలో భవన మరమ్మతులు జరుగుతున్నందున వేదిక స్థలాన్ని నాయుడు ఫంక్షన్ హాల్‌కు మార్చటం జరిగిందని చెప్పారు. లాటరీ కార్యక్రమం మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు.

>
మరిన్ని వార్తలు