టుడే అప్‌డేట్స్‌..

1 Oct, 2019 09:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేటి నుంచి విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ఒత్తిడితో విశాఖపట్నం-విజయవాడ మధ్య విమాన సర్వీసుల పునరుద్దరణకు ఎయిర్‌ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ విమానశ్రయాల నుంచి సర్వీస్‌లను పునరుద్దరించాలని పౌరవిమానయన శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇక నేటి అప్‌డేట్స్ ఇవి.. 

 రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ నేటి నుంచి ఆరంభం కానుంది. కొత్త విధానంలో ప్రభుత్వం దశల వారీగా మద్యనిషేధానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా మంగళవారం అక్టోబర్‌ 1 నుంచి పలు కీలక మార్పులను సర్కారు తీసుకొస్తోంది. ప్రధానంగా మద్యం అమ్మకాలు ఇకపై రాత్రి 8 గంటల వరకే పరిమితం చేస్తున్నారు.

► ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా నేడు గాయత్రి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా నేడు గవర్నర్‌ హరిచందన్‌ బిశ్శభూషణ్‌ కుటుంబసమేతంగా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు.  

► శ్రీశైలం దసరా మహోత్సవాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు చంద్రఘంట అలంకారంలో భ్రమరాంబాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

► తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆదివారం అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరుపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం చిన్నశేష వాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు  శ్రీవేంకటేశ్వర స్వామి హంస వాహనంపై మలయప్ప స్వామి అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తారు.  


తెలంగాణ అప్‌డేట్స్‌..
నేడు ప్రగతిభవన్‌లో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ భేటి జరగనుంది.  

హైదరాబాద్‌లో నేడు..

► వేదిక: శిల్పారామం, ఉప్పల్‌  

 • ఫోక్‌ డ్యాన్స్‌ బై రాధిక శ్రీనివాస్‌ శక్తి సమయం: సాయంత్రం 5 గంటలకు 
 • కూచిపూడి రెక్టికల్‌ వనిరామం స్టూడెంట్స్‌ సమయం: సాయంత్రం 6 గంటలకు 
 • భరతనాట్యం రెక్టికల్‌ సమయం: సాయంత్రం 5 గంటలకు 
 • కథక్‌ రెక్టికల్‌ సమయం: సాయంత్రం 5–30 గంటలకు 
 • ఒగ్గు డోలు ఫోక్‌ సమయం: సాయంత్రం 6 గంటలకు 

►  వేదిక: లాల్‌ బహదూర్‌స్టేడియం 

 • వ్రెస్లింగ్‌ కాంపిటీషన్‌, సమయం: ఉదయం 8 గంటలకు  
 • ఆల్‌ ఇండియా ఒపెన్‌ ఫైడ్‌ రేటింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌, సమయం: సాయంత్రం 6 గంటలకు 

►  చిల్డర్న్‌ ఆఫ్‌ మెన్‌ – ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ ఫ్రీ స్క్రీనింగ్‌

 • వేదిక: నృత్య – ఫోరమ్‌ ఫర్‌ ఫర్ఫామింగ్‌ ఆర్ట్స్,  బంజారాహిల్స్‌ , సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

 ► ఆకృతి ఎలైట్‌ ఎగ్జిబిషన్‌ ఆండ్‌ సేల్‌ 
      వేదిక: తాజ్‌ డక్కన్, బంజారాహిల్స్‌, సమయం: సాయంత్రం 4 గంటలకు 

►  ఫ్లేవర్స్‌ ఆఫ్‌ టర్కీ 
     వేదిక: హైదరాబాద్‌ షెరటాన్‌ హోటల్,  గచ్చిబౌలి, సమయం: రాత్రి 7 గంటలు 

► అక్టోబర్‌ ఫెస్ట్‌: ట్రెడిషనల్‌ ఫుడ్‌ 
     
వేదిక: ది వెస్ట్రన్‌ హైదరాబాద్‌ మైండ్‌ స్పేస్,  హోటల్‌ మాదాపూర్‌ ,సమయం: సాయంత్రం 5 గంటలు 

► మహాత్మ 150 డ్రాయింగ్స్‌ బై శంకర్‌ పామర్తి 
    వేదిక: కళాకృతి, బంజారాహిల్స్‌ , సమయం: ఉదయం 10–30 గంటలకు 

► సౌత్‌ కాస్ట్‌ స్పైస్‌ట్రైల్‌ 
    వేదిక: ఫార్చూన్‌ పార్క్‌ వల్లభ హోటల్‌ , రోడ్‌నం.12, బంజారాహిల్స్‌ , సమయం: సాయంత్రం 5 గంటలు 

► డిస్కో దాండియా  
    వేదిక– ది పార్క్‌ హైదరాబాద్,  సోమాజీగూడ ,సమయం: సాయంత్రం 6 గంటలకు 

► నవరాత్రి ఉత్సవ్‌ 2019 
    వేదిక: బేగంపేట్‌ హాకీ స్టేడియం, రసూల్‌పుర, సమయం: సాయంత్రం 6–30 గంటలకు 

► నాందారీ గౌరవ్‌ నవరాత్రి ఉత్సవ్‌ 2019 
    వేదిక: ఎస్‌ ఎస్‌ కన్వెంషన్‌  సెంటర్,  శంషాబాద్‌, సమయం: రాత్రి 9 గంటలకు 

► సిల్క్‌ ఆండ్‌ కాటన్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక: టీటీడీ బాలాజీ భవన్, హిమాయత్‌నగర్‌, సమయం: ఉదయం 10–30 గంటలకు 

► ఏ జోన్‌ ఇంటర్నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ కోచింగ్‌ క్యాంప్‌ 
    వేదిక: ఇండోర్‌ స్టేడియం , గచ్చిబౌలి, సమయం: ఉదయం 7 గంటలు 

►  రామాయణ్‌ మేళా 
    వేదిక: ఎగ్జిబిషన్‌ గ్రౌండ్,  నాంపల్లి, సమయం: రాత్రి 7 గంటలకు 

► నవరాత్రి ఉత్సవ్‌ 2019 
    వేదిక: కంట్రీ క్లబ్, బేగంపేట్‌ ,సమయం: రాత్రి 7 గంటలకు 

► ఆల్‌ ఇండియా శారీమేళ, దసరా ఫెస్టివల్‌ 
    వేదిక: శిల్పారామం , సమయం: ఉదయం 11–30 గంటలకు 

► డైమండ్‌ జ్యువెలరీ – ఎగ్జిబిషన్‌ 
    వేదిక: ఒఆర్‌ఆర్‌ఎ డైమండ్‌ జ్యువెలరీ , పంజాగుట్ట, సమయం: ఉదయం 10 గంటలకు 

► పాన్‌ ఏషియన్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌     
    వేదిక: చైనా బిస్ట్రో, జూబ్లీహిల్స్‌ , సమయం: మధ్యాహ్నం12.30 గంటలకు 

► ఇండియన్‌ ఫొటోగ్రఫీ ఫెస్టివల్‌ 
    వేదిక:తెలంగాణస్టేట్‌గ్యాలరీఆఫ్‌ఫైన్‌ ఆర్ట్స్‌, సమయం: ఉదయం 9 గం. 

►  వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌

 •  యోగా క్లాసెస్‌  సమయం: సాయంత్రం 6 గంటలకు 
 •  భరత నాట్యం క్లాసెస్‌, సమయం: సాయంత్రం 5–30 గంటలకు 
 •  మోహినీయట్టం క్లాసెస్‌, సమయం: సాయంత్రం 4.30 గంటలకు.
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా