15 రోజులే మిగిలింది ..

16 Mar, 2019 15:10 IST|Sakshi
నవాబుపేటలో మరుగదొడ్ల నిర్మాణంపై శిక్షణ ఇస్తున్న సిబ్బంది

సాక్షి,నవాబుపేట: మరుగదొడ్లు వంద శాతం పూర్తి చేయాలని టార్గెట్‌ విధించినా.. గ్రామాల్లో ఇంకా నత్త నడకన వాటి నిర్మాణం సాగుతుంది. దీంతో మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చినా.. అది ఆచరణలో లేక పోవటం శోచనీయం. కేవలం రెండు, మూడు గ్రామాలు మినహయిస్తే మిగతా వాటిలో చాలా ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఇప్పటికీ మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి725 మరుగుదొడ్లు ప్రారంభమే కాలేదు.

కాగా అమ్మపూర్, కొండాపూర్, ఇప్పటూర్, పోమాల్, కొల్లూర్‌ గ్రామాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు ని ర్మించాల్సి ఉంది. కాగా లబ్ధిదారులు మరుగదొడ్ల నిర్మాణానికి సంబంధించి మార్కవుట్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం ఏర్పడింది. దీంతో మార్చి టార్గెట్‌ పూర్తి కావటం కష్టంగానే మారింది. కాగా మొత్తం 3432 మరుగుదొడ్లు మార్చిలో పూర్తిచేయాలని ఉండగా 1350 పూర్తయ్యాయి. నవాబుపేటలో 307, లోకిరేవులో 235, కూచూర్‌లో230, ఖానాపూర్‌లో 134, కాకర్జాలలో 250, హజిలాపూర్‌లో 188, చౌడూర్‌లో 122, గురుకుంటలో 188, కాకర్లపహడ్లో 128, కారుకొండలో 184, తీగలపల్లిలో130 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. 

నిర్మాణంలో మహిళా మేస్త్రీలు.. 
మండలంలో ప్రత్యేకంగా 25 మంది మహిళా మేస్త్రీలకు శిక్షణ ఇచ్చి లక్ష్యాన్ని పూర్తి చేసే కార్యక్రమం చేపట్టారు. మహిళలకు ప్రత్యేకంగా 5 రోజులు శిక్షణ ఇచ్చి, మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు