ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

7 Jan, 2014 10:37 IST|Sakshi
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి

హైదరాబాద్ : నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని  పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్లోని అతని పార్థివదేహాన్ని ఉంచారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు.

దర్శకుడు దాసరి నారాయణరావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, చలపతిరావు, నటి జయసుధ, అశోక్ కుమార్, వరుణ్ సందేశ్, ఎంఎస్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, రామానాయుడు, శ్రీకాంత్, శివాజీ రాజా, దర్శకుడు సముద్ర, అనూప్ రూబెన్స్, కాదంబరి కిరణ్ కుమార్, బెనర్జీ తదితరులు ఉదయ్ కిరణ్కు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు