టమాటా రైతు డీలా

25 Jan, 2014 01:07 IST|Sakshi
  •      భారీగా తగ్గిపోయిన ధర..
  •      ఖర్చులు సైతం రావడం లేదంటున్న రైతు
  •  
    అచ్యుతాపురం,న్యూస్‌లైన్: టమాటా ధర విపరీతంగా తగ్గిపోవడంతో రైతులు డీలాపడ్డారు. రైతు బజారులో కొనుగోలుదారులు లేకపోవడంతో శుక్రవారం కిలో టమాటా మూడు రూపాయలకే అమ్ముకోవలసివచ్చిం ది. అయితే బయట మార్కెట్‌లో కిలో రూ.10 పలికిం ది. ఇక్కడి మార్కెట్‌కి గతంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి హోల్‌సేల్ వ్యాపారులు వచ్చేవారు. ఇక్కడ బసచేయడానకి వసతులు లేకపోవడం, రవా ణా చార్జీలు పెరగడంతో వారు ఇప్పుడు రావడం లేదు. దీంతో రైతులు తమ పంటను పూర్ణామార్కెట్ దళారులకు మాత్రమే అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది.

    పూర్ణామార్కెట్ వర్తకులంతా సిండికేట్‌గా ఏర్పడి మా ర్కెట్‌కి వచ్చిన సరుకును బట్టి రేటు తగ్గిస్తున్నారు. ఆరు గంటలకే మార్కెట్‌కు సరుకు చేరినప్పటికీ 9 గం టల వరకూ కొనుగోలుచేయడంలేదు. రైతులు పాతిక కిలోల గంప ధర రెండు వందలు చె బితే వర్తకులు రూ. 60కి అడుగుతున్నారు.సరుకు అమ్మకం కాకపోతే పూర్తిగానష్టపోతామన్న భయంతో అందినకాడికి  అమ్ముకుంటున్నారు.

    మేలుజాతి విత్తనాలు, దుక్కులు, క్రిమిసంహారక మందులు, తోటలో పంటను ఏరడానికి కూలీ ఖర్చు ఇవన్నీ భారీగా పెరుగుతున్నా మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. అచ్యుతాపురంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి బసచేయడానికి సౌకర్యం ఏర్పాటు చేస్తే వర్తకుల మధ్య పోటీ ఏర్పడి తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.
     
     ఎందుకు వేశామా అన్నట్లుంది...
     పంట ఎందుకేశామా అనిపిస్తోంది. టమాటా అమ్మితే ఊరులోనుంచి రైతుబజారుకి దారిఖర్చులు రావడంలేదు. ఏమి తిని బతకాలి. అమ్ముడవకుంటే బయట పారబోయాలి. మార్కెట్‌లో ఎంత ధర ఉంటుందో చెప్పలేకపోతున్నాం. వ్యాపారులంతా సిండికేటైపోతున్నారు. మార్కెట్లో సరుకును చూసుకొని రేటు నిర్ణయిస్తున్నారు. రైతు పండిస్తేదళారులు బాగుపడుతున్నారు.  
     - ధర్మిరెడ్డి అప్పలనాయుడు
     

మరిన్ని వార్తలు