దిగివచ్చిన టమోటా

29 Jul, 2017 12:01 IST|Sakshi
మదనపల్లె : నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న టమోటా  ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మదనపల్లె మార్కెట్‌ యార్డులో 13 రోజుల క్రితం కిలో రూ. 88 వరకు పలికిన మొదటి రకం టమోటా  శుక్రవారానికి రూ. 43కు దిగింది. జిల్లాలోని పడమటి మండలాల్లో, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో టమోటా పంట ఎక్కువగా సాగు చేస్తారు. ప్రస్తుతం చింతామణి, కోలారు, బి. కొత్తకోట, తంబళ్లపల్లె ప్రాంతాల్లో కొత్త పంట అందుబాటులోకి రావడం, నూతన వంగడాలతో తక్కువ కాలంలో పంట ఉత్పత్తులు చేయడంతో మార్కెట్‌ యార్డుకు సరకు రావడం పెరిగింది.
 
దీంతో పాటు వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకున్న మార్పులు, వర్షాలు లేకపోవడంతో టమోట నాణ్యత తగ్గడం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం కాయలు కొత్తవి, మచ్చలు, నాణ్యత తక్కువతో వస్తుండడంతో కొనుగోలుకు వ్యాపారులు విముఖత చూపడం లేదు. రాబోయే రోజుల్లో ధర మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. శుక్రవారం మదనపల్లె మార్కెట్‌ యార్డుకు 321 మెట్రిక్‌ టన్నుల టమోట వచ్చింది. తక్కువ రకం టమాట ధర కిలో రూ. 20కు అమ్ముడుపోయింది. 
మరిన్ని వార్తలు