రేపు తెలంగాణ బంద్

10 Feb, 2014 00:08 IST|Sakshi

 ఉస్మానియా విద్యార్థి సంఘాల పిలుపు
 సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 11వ తేదీ మంగళవారం తెలంగాణ బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని అధికారాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో 20 విద్యార్థి సంఘాల నేతలు సమావేశమై, తెలంగాణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు కోట శ్రీనివాస్‌గౌడ్, ఆజాద్, సయ్య ద్ సలీంపాషా తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’లో ఎన్నో చిల్లులున్నాయని వ్యాఖ్యానించారు. గవర్నర్ చేతికి శాంతిభద్రతలను అప్పగిస్తే.. బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.
 
  హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కూడా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పోల వరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో చేర్చడం కాదని, అసలు ఈ ప్రాజెక్టునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏమైనా తేడాలు వస్తే.. తెలంగాణలో ఈ ప్రాంత ఎంపీలను అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, ఆంక్షల్లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు కూడా 11న బంద్‌కు పిలుపునిచ్చారు. ఫ్రంట్ రాష్ట్ర నేతలు జయ, నర్సింగరావు, రాజా నర్సింహ, సంధ్యలు బంద్ విషయాన్ని వెల్లడించారు. టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వం పూట కో షరతు పెడుతోందని, హైదరాబాద్ ఆదాయాన్ని సీమాం ధ్రకు పంచుతామంటే సహించేది లేదని అన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వాసిరెడ్డి పద్మ

వారికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది: సీఎం జగన్‌

‘నాలుగు పంపుహౌస్‌ల్లో ఒకటే పనిచేస్తోంది’

‘ఐఐటీ తిరుపతి అభివృద్దికి సహకరించండి’

ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి

ఈనాటి ముఖ్యాంశాలు

పెట్టుబడులు ఎక్కడ చంద్రబాబు? : అవంతి

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి

జెండా వందనం చేసే మంత్రులు వీరే!

‘పోలవరం పునారావాస బాధితులకు న్యాయం చేస్తాం’

పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు జలకళ

ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వకు గండి

రాపాక అరెస్ట్‌.. రాజోలులో హైడ్రామా

త్వరలోనే పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స

మానవ వనరుల్ని తయారు చేయండి : సీఎం జగన్‌

అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం జగన్‌

‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

ఏపీ డీజీపీగా గౌతం సవాంగ్‌.. పూర్తిస్థాయి నియామకం

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన డిప్యూటీ సీఎం

టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పథకాల అమలుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

నవ వధువు అనుమానాస్పద మృతి..!

సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

సచివాలయ ఉద్యోగాలకు 7 రోజుల పాటు పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌