నాణ్యతలో అగ్రగామి భారతి సిమెంట్

19 Dec, 2013 03:56 IST|Sakshi

మహబూబ్‌నగర్(భగీరథకాలనీ) న్యూస్‌లైన్: ప్రపంచంలోనే సిమెంట్ కంపెనీలలో కెళ్లా అగ్రగామి సిమెంట్‌గా భారతి సిమెంట్ నిలిచిందని సంస్థ  మార్కెటింగ్ జనరల్ మేనేజర్ ఎంసి మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని త్రిస్టార్ సింధూ హోటల్లో జిల్లాలకు చెందిన సివిల్ ఇంజనీర్లతో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. అతితక్కువ కాలంలోనే  ప్రజల ఆదరణ పొందుతూ ఈ కంపెనీ మంచి గుర్తింపు పొందిందని  తెలిపారు. భారతదేశంతోపాటు విదేశాలలో కూడా మంచి గుర్తింపు లభించిందని  వెల్లడించారు.
 
 ఈ కంపెనీని ప్రారంభించిన నాలుగేళ్లలోనే అంచలంచెలుగా ఎదుగుతూ వస్తోందన్నారు. ఈ సిమెంట్‌ను నాణ్యతతో తయారు చేస్తున్నామని దీంతో భవనాలు, కాంక్రిట్ నిర్మాణాలు అత్యధిక కాలం పాటు మన్నిక పొందగలుగుతాయని  తెలిపారు. దేశంలోని చాలా ల్యాబ్ టెస్టింగ్ సెంటర్‌లు ఈ సిమెంట్ నాణ్యతకు కితాబు ఇచ్చాయని ఆయన తెలిపారు.  అత్యాధునిక జర్మన్ టెక్నాలజీతో సిమెంటును తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు.  ప్రతీ బస్తాలోని సిమెంటు నాణ్యతను పరిశీలించేందుకు రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. సిమెంటు బస్తాలు బయటి మార్కెట్లో ఎలాంటి కల్తీకి లోనవకుండా ఇప్పటివరకు ఏ కంపెనీ ప్రవేశపెట్టని టాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ చేస్తున్నామని ఆయన గుర్తుచేశారు. తమ సిమెంట్ నాణ్యతకు మరో పేరని పాలమూరు ప్రజలు ఇప్పటిలాగే ఇంకా ఆదరణ చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
 
 మొబైల్ వాహనాలతో అవగాహన కార్యక్రమాలు
 కాంక్రీట్ నిర్మాణాలలో అవలంభించాల్సిన పద్దతులపై గ్రామాల్లోని, పట్టణాలోని భవన నిర్మాణ కార్మికులకు భారతి సిమెంట్ సంచార వాహనాలతో వెళ్ళి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గోన్న మేస్త్రిలకు రూ.లక్ష విలువ గల ఉచిత బీమాను చేయనున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిఎం కొండల్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి,సతీష్ రాజు,నరేష్.ఇంజనీర్లుశ్రీనివాస రెడ్డి,ఈశ్వరయ్య,రమేష్‌లు పాల్గోన్నారు.
 

మరిన్ని వార్తలు