ఇక ఫెస్టివల్స్‌ నిర్వహణ పర్యాటకశాఖకే

27 Mar, 2018 09:21 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి అఖిలప్రియ

పర్యాటక ఆకర్షణకే యాటింగ్‌ ఫెస్టివల్‌

పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వివిధ ఫెస్టివల్స్‌ను వచ్చే ఏడాది నుంచి పర్యాటకశాఖే నిర్వహిస్తుందని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆదాయం వచ్చే ఈవెంట్లు, పండగలను నిర్వహించడం ఎలా? అన్న దానిపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి జరగనున్న యాటింగ్‌ ఫెస్టివల్‌ వివరాలను తెలిపేందుకు సోమవారం రాత్రి ఫిషింగ్‌ హార్బర్‌ జెట్టీ వద్ద ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో 24 ఈవెంట్లకు గాను 18 మాత్రమే నిర్వహించామన్నారు.

వచ్చే సంవత్సరం ఏఏ కార్యక్రమాలు చేపట్టాలో కేలండర్‌ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటకరంగంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోందన్నారు. విశాఖలో ఉన్న అందమైన పర్యాటక వనరులను బయట ప్రపంచానికి తెలియజేయడానికి, అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షించేందుకు యాటింగ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఫెస్టివల్‌కు వచ్చే ఆదరణను బట్టి భవిష్యత్‌లో ఇలాంటివి నిర్వహించాలా? వద్దా? అన్నది అధ్యయనానికి వీలుంటుందన్నారు. గోవాలో యాటింగ్‌ ద్వారా గంటకు రూ.90 వేల నుంచి లక్ష ఆదాయం వస్తుందని, విశాఖలోనూ అలాంటి ఆదరణ ఉంటుందో, లేదో చూస్తామన్నారు.

ఫెస్టివల్‌లో పాల్గొనున్న 9 బోట్లు
యాటింగ్‌ ఫెస్టివల్‌లో 9 బోట్లు పాల్గొంటున్నాయన్నారు. ఈ ఫెస్టివల్‌ పూర్తయ్యాక వీటిలో రెండు బోట్లను కొన్నాళ్లపాటు ఆసక్తి ఉన్న వారి కోసం ఇక్కడ ఉంచుతామని తెలిపారు. అనుమతి కోసం విశాఖ పోర్టు ట్రస్టు అధికారులతో చర్చిస్తామన్నారు. యాటింగ్‌లో పాల్గొనే బోట్లకు రక్షణగా గజ ఈతగాళ్లున్న స్థానిక మత్స్యకారుల బోట్లు ఉంటాయని, అత్యవసర సాయం అందించడానికి నేవీ అంగీకరించిందని చెప్పారు.

ఇప్పటివరకు 14 మంది రిజిస్ట్రేషన్‌
ఇప్పటిదాకా ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు 14 మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారన్నారు. యాటింగ్‌ క్రీడ ఖరీదు కూడుకున్నది కావడంతో ఉన్నత వర్గాల వారిని దృష్టిలో ఉంచుకునే టిక్కెట్టు ఖరీదు రూ.14,500గా నిర్ణయించామన్నారు. అన్ని పర్యాటక ఈవెంట్లను ఈ–ఫ్యాక్టర్‌ సంస్థకే ఎందుకు కట్టబెడుతున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ టూరిజం ఎంప్యానల్‌ అయినందును ఈ సంస్థకు అప్పగిస్తున్నామన్నారు.

ఈ యాటింగ్‌ ఫెస్టివల్‌ ద్వారా వచ్చిన సొమ్మును మత్స్యకారుల సంక్షేమానికి ఖర్చు చేస్తామని ఈ–ఫ్యాక్టర్‌ సంస్థ ప్రతినిధి సుమీత్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ సృజన మాట్లాడుతూ యాచింగ్‌ ఫెస్టివల్‌లో వివిధ అడ్వెంచర్‌ ఈవెంట్లతో పాటు ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి లక్కీ డ్రా తీస్తామన్నారు. విజేతలకు ఒకరోజు యాచ్‌ల్లో ఉచితంగా విహరించే అవకాశం కల్పిస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో పర్యాటకశాఖ ఈడీ డి.శ్రీనివాసన్, జిల్లా పర్యాటకాధికారి పూర్ణిమదేవి, ఈఫ్యాక్టర్‌ సంస్థ ప్రతినిధి ముఖర్జీ పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి షాక్‌

దేవుడు నా మొర ఆలకించాడు: పృథ్వీరాజ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

‘ఇది ఎమ్మెల్యే కాలేజీ.. దిక్కున్నచోట చెప్పుకోండి’

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి..

గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..

పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతి

ఆగస్టు 1న జెరూసలేంకు సీఎం జగన్‌

చచ్చిపోవాలని రైల్వేస్టేషన్‌కొచ్చింది! ఆపై..

విజయవాడ కరకట్ట మీద కారు బీభత్సం

ఆంధ్ర, తెలంగాణల్లో రేషన్‌ అనుసంధానం

విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా?

క్వారీ..సర్కారు మారినా స్వారీ

నేను కూడా పోలీసులను అడగలేదు : డిప్యూటీ సీఎం

సోనీ కిడ్నాప్‌ కేసులో పోలీసుల పురోగతి

ఉద్యోగ విప్లవం

‘శివాజీ వెనుక చంద్రబాబు హస్తం’

ఓఎస్డీగా అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

హెరిటేజ్‌ మేనేజర్‌ కల్తీ దందా

భర్త ముందే భార్యతో ఫోన్‌లో..

వైద్యం.. ప్రైవేట్‌ రాజ్యం..! 

నో ట్రిక్‌.. ఇక బయోమెట్రిక్‌

వంశధార స్థలం ఆక్రమణ వాస్తవమే..

బోల్‌ భం భక్తుల దుర్మరణం

క్షణ క్షణం.. భయం భయం

గ్రామసచివాలయాల్లో కొలువుల జాతర

నిధుల కొరత లేదు: మంత్రి బుగ్గన

టిక్‌‘ట్రాప్‌’లో శక్తి టీమ్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌