రుణాలు కట్టలేదని.. ట్రాక్టర్లు సీజ్

14 Aug, 2014 10:32 IST|Sakshi

రైతు రుణాల మాఫీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమీ తేల్చకపోవడం అన్నదాతల తల మీదకు వస్తోంది. అనంతపురం జిల్లాలో బ్యాంకు అధికారులు అత్యుత్సాహం చూపించారు. వజ్రకరూర్ స్టేట్బ్యాంక్ అధికారులు 15 మంది రైతులకు చెందిన ట్రాక్టర్లను సీజ్ చేశారు.  మడకశిర మండలంలోని బి.రాయపురం, బుల్లసముద్రం ప్రాంతాల్లో 50 మంది రైతులకు కూడా మడకశిర స్టేట్ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఒకవైపు తెలంగాణలో లక్ష రూపాయల వరకు రైతులకు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రుణ మాఫీ గురించి ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు. బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తే పదేళ్లలో తాము తిరిగి చెల్లిస్తామనడంతో ఇటు రిజర్వు బ్యాంకు గానీ, రాష్ట్రంలోని బ్యాంకులు గానీ ప్రభుత్వం మాటలను విశ్వసించడం లేదు. మరోవైపు రైతులు మాత్రం తమ రుణాలు మాఫీ అవుతాయేమోనని ఆశగా ఉన్నారు. వాళ్లు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఇప్పుడు ఆస్తుల స్వాధీనం మొదలుపెట్టాయి.

మరిన్ని వార్తలు