‘వాణిజ్యం’పై సమైక్య సమ్మెట!

8 Apr, 2014 00:46 IST|Sakshi
  •      అయినా లక్ష్యంలో 82.53 శాతం వసూళ్లు
  •      అదనపు ఆదాయ వసూలులో ముందంజ
  •      అమ్మకపు పన్ను వసూళ్లు రూ.1294.12 కోట్లు
  •      విశాఖ డివిజన్ డీసీ టి.శివశంకరరావు
  •  సాక్షి, విశాఖపట్నం : ‘సమైక్యాంధ్ర ఉద్యమంతో వ్యాపారాలు మందగించాయి. కస్టమ్స్ సుంకం పెంపు, నిబంధనలు కఠినతరం కావడంతో బులియన్ రాబడి తగ్గుముఖం పట్టింది. ఈ విభాగంలో ఒక్క ఎంఎంటీఎస్ డీలర్ ద్వారానే రూ.31 కోట్లు తక్కువగా అమ్మకపు పన్ను వసూలు జరిగింది. వరుస సమ్మెలతో పారిశ్రామిక రంగం డీలాపడింది.

    అయినా 2012-13 ఆర్థిక సంవత్సరం అమ్మకపు పన్ను వసూలు (రూ.1254.16 కోట్లు) కంటే ఇటీవల ముగిసిన ఆర్ధికేడాదిలో 3.19 శాతం (రూ.39.96 కోట్లు) వృద్ధితో రూ.1294.12 కోట్లు వసూలు సాధించినట్టు’ విశాఖపట్నం డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ టి.శివశంకరరావు తెలిపారు. సోమవారం ఆయన  విలేకరుల సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి డివిజన్ సాధించిన అమ్మకపు పన్ను, వసూళ్ల ప్రగతిని వివరించారు.
     
    ప్రధాన డివిజన్లలో ముందంజ : గత ఏడాది వ్యాట్ రూ.1254.16 కోట్లు వసూలవగా, ఈసారి రూ.1294.12 కోట్లు వసూలైంది.  గతేడాది పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉండటంతో అమ్మకపు పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1568.06 కోట్లలో 82.53 శాతం మాత్రమే సాధించగలిగినట్టు పేర్కొన్నారు. పన్నేతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో కలిపితే రూ.1351.47 కోట్లు వసూలైనట్టు తెలిపారు. డివిజన్‌లో 58 శాతంగా ఉన్న ఎల్‌టీయూ సర్కిల్ ఈ సారి కేవలం 0.15 శాతం మాత్రమే ప్రగతి నమోదు చేసుకుందన్నారు.

    రూ.130 కోట్లు వరకు ఈ ఒక్క విభాగంలోనే గతంలోకంటే  గతేడాదికంటే పన్ను వసూళ్లు తగ్గడంతో ఆ ప్రభావం డివిజన్‌పై స్పష్టంగా కనిపించిందన్నారు. పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించడం, తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం, ఆడిట్లపై అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆశించిన స్థాయిలో వ సూళ్లు సాధించగలిగినట్టు తెలిపారు.
     
    భారీ క్షీణత వీటిలోనే..
    కొన్ని ప్రధాన సంస్థలు 2012-13 కంటే 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారీ క్షీణత నమోదు చేసుకున్నాయి.
     
     ఎంఎంటీసీ 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.205.32 కోట్లు అమ్మకపు పన్ను చెల్లించింది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ.117.42 కోట్లుకు తగ్గింది. ఈసారి ఇందులో కూడా రూ.31 కోట్లు తక్కువగా ఈ సంస్థ పన్ను చెల్లించింది.
     
    ఆర్థిక సమస్యలతో పీఎస్‌ఎల్ లిమిటెడ్ సంస్థ గతంలో కంటే రూ.13 కోట్లు తక్కువగా చెల్లించింది.
     
    ఎన్‌టీపీసీ ఆర్డర్స్ లేక బొగ్గు దిగుమతులు క్షీణించి కోస్టల్ ఎనర్జీ సంస్థ కూడా 29 కోట్లు తక్కువగా పన్ను చెల్లించింది.
     

మరిన్ని వార్తలు