మేమింతే.. రైళ్లలో సీటు కుదరదంతే

8 Sep, 2019 10:13 IST|Sakshi
రైల్వే పోలీసులతో ప్రయాణికుల వాగ్వాదం

రైళ్లలో విస్తృత తనిఖీలు

సీట్లు లేకుంటే ప్రయాణికులను దింపేస్తున్న సిబ్బంది

మరో ట్రైన్లో వెళ్లాలని సూచన

పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు

సాక్షి, తిరుపతి : ‘మీరు టిక్కెట్‌ కొన్నారా..? ఆ టికెట్‌కు బెర్త్‌గానీ, సీటుగానీ దొరికిందా..? ఆర్‌ఏసీ ఉన్నా పర్వాలేదు. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉందని రిజర్వేషన్‌ బోగీల్లో ఎక్కితే కుదరదు. దిగి వేరే ట్రైన్‌లో వెళ్లాల్సిందే.’ అంటూ తిరుపతి రైల్వే అధికారులు, పోలీసులు తేల్చిచెబుతున్నారు. శనివారం వారు రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండడంతో పలువురు ప్రయాణికులను దింపేశారు. రద్దీ ఉంటే నో జర్నీ అంటూ స్పష్టం చేశారు. ఖాళీగా ఉంటే వెళ్లాలని సూచించారు. పలువురు ప్రయాణికులు ‘సార్‌ మరో ట్రైన్‌కి వెళ్లాలంటూ ఆదేశాలిస్తున్నారు.


రైల్లో నిలబడి ఉండే ప్రయాణికుల కోసం గాలిస్తున్న అధికారులు, పోలీసులు 

ఆ ట్రైన్‌లోనూ రద్దీ ఉంటే ఏమి చేయాలి’ అంటూ రైల్వే అధికారులను ప్రశ్నించారు. ఇలా  ఉదయం వెళ్లాల్సిన ప్రయాణికులను రోజంతా తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఉంచుకుని సాయంత్రం పంపడం న్యాయమా..? అంటూ ప్రశ్నించారు. సార్‌ మీరు రిజర్వేషన్‌ కోసం వచ్చే ప్రయాణికులకు బెర్త్‌ లేదా ఆర్‌ఏసీ టిక్కెట్‌ ఉంటే ఇవ్వండి.. అంతేతప్ప వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్లు ఇవ్వద్దూ అంటూ విన్నవించారు. వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్లు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంగా టిక్కెట్‌ తీసుకుని జనరల్‌ బోగీలో ప్రయాణం చేస్తాం.. లేదా ఆర్టీసీ బస్సులో వెళ్లిపోతాం. అంతేతప్ప రిజర్వేషన్‌ టిక్కెట్‌తో కూడిన మొత్తాన్ని వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్‌కు చెల్లించాల్సిన పని ఉండదని వారు వివరించారు. అలా పలువురు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. 

మరిన్ని వార్తలు